« గీతం గీతం జయ జయ గీతం
Geetham geetham jaya jaya geetham
share with whatsapp

పల్లవి:
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము    (2X)
యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము    (2X)
...గీతం...
1.
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను    (2X)
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు     (2X)
...గీతం...
2.
వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు    (2X)
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి    (2X)
...గీతం...
3.
అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి    (2X)
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి    (2X)
...గీతం...
4.
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా    (2X)
మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి    (2X)
...గీతం...